MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణ, దుందుభి నదులు వ్యవసాయానికి ఊపిరిపోస్తున్నాయి. జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. నేడు ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని, ఈ జీవ నదులను కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.