TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేక కూలిపోతుందని గుంటనక్కలు ఎదురుచూశాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంట నక్కల ఆశలన్నీ నీరుగారుస్తూ.. ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకూడదని ఒకేసారి రుణ మాఫీ చేశామని చెప్పారు. నిత్యం రైతుల ఆనందం గురించే సీఎం ఆలోచిస్తారని తెలిపారు.