TG: మహిళల పేరుతోనే అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. 2034కి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. పిల్లలను ప్రైవేట్ స్కూల్స్‌లో చదివించాలనే మోజుకు పోకండని సూచించారు. ప్రభుత్వ స్కూల్స్‌ను అన్ని రకాల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు పాలు, రాగి, జావ, పౌషికాహారం అందిస్తామని చెప్పారు.