AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. APIIC భూముల మ్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 51,603 ఎకరాల భూములను వెబ్ ల్యాండ్‌లో APIIC పేరుతో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. APIIC ఆధీనంలోని 70 వేల ఎకరాల ప్రభుత్వ భూములను 22A నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.