CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,000 విరాళాన్ని నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన దాత రాజశేఖర్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతకు దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.