TG: వృత్తి విద్య నేర్చుకుంటే నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చని యువతకు సీఎం రేవంత్ సూచన చేశారు. చదువు తక్కువ ఉన్నా పని నేర్చుకునే ఆసక్తి ఉండాలన్నారు. ATCలో చదువుకుంటున్న విద్యార్థులకు రూ.2 వేలు స్టైఫండ్ ఇస్తున్నామని చెప్పారు. ప్రతిభ ఉంటే ప్రపంచం తల వంచుతుందని తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్య వైపు విద్యార్థులు మారాలని సూచించారు.