BDK: ఖమ్మం నగరంలో బంద్ నిర్వహించిన నాయకులను అరెస్టు చేయడం సరికాదని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు విమర్శించారు. టేకులపల్లి కేంద్రంలో నాయకులు మాట్లాడుతూ.. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని ఆరోపించారు. కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చి సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.