RR: చేవెళ్ల నియోజకవర్గం పూలపల్లి గ్రామంలోని 4వ, 6వ వార్డు మెంబర్లుతో పాటు సర్పంచ్ భాగ్యలక్ష్మి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని భీమ్ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.