NLG: గుండ్లపల్లి(డిండి) మండలం ఖానాపూర్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బాలునాయక్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందుతుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.