సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్లో ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.