MDCL: కాప్రా, ఘట్కేసర్, మేడిపల్లి మండలాలకు వాట్సప్ మెసేజ్ ద్వారా ఆదాయ, OBC ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నట్లుగా దరఖాస్తుదారులు తెలిపారు. ఇప్పటికి 3 మండలాల పరిధిలో 12కు పైగా పెండింగ్ ఉన్నట్లుగా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత యంత్రాంగం తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.