BHNG: ఆలేరు పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం బీసీలను మొదటి నుంచే మోసం చేస్తోందని ఆరోపించారు. బీసీల అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. బీసీలకు 40 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.