ఆస్తి తగాదా కారణంగా తనపై దాడి జరిగిందని మళయాళ నటి సజిని వెల్లడించింది. 2001లో సినిమాల ద్వారా వచ్చిన సంపాదనతో తన తల్లి పేరుతో జూబ్లీహిల్స్లో ఇల్లు కొన్నానని వెల్లడించింది. ఇప్పుడు ఆ ఇంటి కోసం తన అక్క, వాళ్ల పిల్లలతో పాటు తన భర్త కూడా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రూ.10 కోట్ల ఆస్తి లాగేసుకోవాలని చూస్తున్నారని పేర్కొంది.