Parents put padlock:పాకిస్థాన్లో (Pakistan) ఆర్థిక సంక్షోభం పీక్కు చేరుకుంది. ధరల వాత తప్పడం లేదు. రాజకీయ అస్థిరత ఉండనే ఉంది. దీంతోపాటు ఓ వార్త ఒళ్లు గగుర్పాటునకు గురిచేస్తోంది. మృతదేహాలను కూడా కొందరు వదలడం లేదట. ఈ మేరకు డైలీ టైమ్స్ రిపోర్ట్ చేసింది. దేశంలో నైక్రోపిలియా కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది.
2011లో తొలి నెక్రోఫిలియా కేసు ఫైల్ అయ్యింది. కరాచీలో (karachi) గల ఉత్తర నజీమాబాద్కు చెందిన మహ్మద్ రిజ్వాన్ అనే కాటికాపరి 48 మహిళ శవాలపై లైంగికదాడి చేసినట్టు ఒప్పుకున్నాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమాధుల్లో ఉన్న మృతదేహాలపై లైంగికదాడి చేసినట్టు తెలియడంతో.. మిగతా పేరంట్స్ (parents) కూతుళ్ల శవాలు ఉన్న సమాధులకు తాళాలు వేస్తున్నారు.
పాకిస్థాన్ (pakistan) గుజ్రాత్ ప్రాంతంలో గల చక్ కమలా గ్రామంలో కొందరు బాలిక శవాన్ని తవ్వి, లైంగికదాడి చేశారట. ఖననం చేసిన అదే రోజు రాత్రి అఘాయిత్యానికి ఒడిగట్టారట. బాలిక సమాధికి మతపమ కార్యక్రమాలు నిర్వహించేందుకు బంధువులు రాగా.. విషయం వెలుగులోకి వచ్చింది. 2021లో కోస్టల్ టౌన్ గులాముల్లా సమీపంలో మౌల్వీ అష్రఫ్ చండియో గ్రామంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది.
2020లో పాకిస్థాన్ (pakistan) పంజాబ్లో (punjab) కూడా శవాన్ని రేప్ చేస్తోన్న సమయంలో నిందితుడిని పట్టుకున్నారు. 2019 కరాచీలో లాంధీ టౌక్లో ఓ మహిళ (women) మృతదేహాన్ని తవ్వి లైంగికదాడి చేశాడు. 2013లో గుజ్రాన్ వాలాలో 15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని సమాధి నుంచి తీసి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిసింది. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.