SRD: మన్నాపూర్ ప్రాథమిక పాఠశాలను జిల్లా అధికారుల బృందం తనిఖీ చేసింది. పాఠశాల రికార్డులు, ఎఫ్ఎల్ఎన్, ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమాలు, ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. పాఠశాల పనితీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వయం పాలన దినోత్సవంలో విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. జిల్లా నోడల్ అధికారి ప్రదీప్ కుమార్, అధికారులు వహబోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.