»6 Dead Over 11 Missing After Massive Fire Breaks Out In New Zealand Hostel
New Zealand:హాస్టల్లో అగ్నిప్రమాదం.. 6 మంది మృతి, 11 మంది మిస్సింగ్
న్యూజిలాండ్‌లో ఓ హాస్టల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది ఆచూకీ తెలయడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
6 dead, over 11 missing after massive fire breaks out in New Zealand hostel
New Zealand:న్యూజిలాండ్ (New Zealand) వెల్లింగ్టన్లో హాస్టల్లో అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలో ఆ హాస్టల్ ఉంది. ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
లొఫర్స్ లాడ్జ్ పై అంతస్తు నుంచి అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలయరాలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. మృతుల సంఖ్య 10 లోపు ఉండొచ్చని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్ హిప్ కిన్స్ (Chris Hipkins) తెలిపారు.
ఆ భవనంలో 92 గదులు (92 Rooms) ఉన్నాయి. అందులోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని.. అయితే పై కప్పు కూలే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు జిల్లా మేనేజర్ కమాండర్ నిక్ ప్యాట్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో అగ్నిప్రమాదం జరగలేదని తెలిపారు. ఇదీ పీడకలగా మిగిలిపోనుందని వివరించారు.