SRPT: సూర్యాపేట పట్టణంలోని శ్లోక నర్సరీని మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత శనివారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. జూన్ నుంచి ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం 1.81 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, తొమ్మిది నర్సరీల ద్వారా 3 లక్షల మొక్కలు పెంచుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ హనుమంత రెడ్డి పాల్గొన్నారు.