వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్న చిరంజీవి వరుస ఇంటర్వ్యూల్లో చాలా విషయాలు పంచుకున్నారు. ఇంటర్వ్యూల్లో చిరుకి.. సినిమా కంటే…. వ్యక్తిగత, రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి. చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటంతో… యాంకర్స్ అడిగే ప్రశ్నల్లో పవన్ కల్యాణ్ కి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా… ఓ ఇంటర్వ్యూలో… చిరంజీవికి పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి చిరు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘మూడు పెళ్లిళ్లు చేసుకోవడమనేది కళ్యాణ్ ఇష్టం. దాని గురించి నేను ఎలాంటి కామెంట్ చేయదలుచుకొలేదు’ అంటూ సమాధానమిచ్చాడు చిరంజీవి. పలు సందర్భాల్లో ఏపీ సీఎం జగన్ సైతం పవన్ మూడు పెళ్లిళ్లపై సెటైర్లు వేశారని ప్రశ్నించగా.. రాజకీయంలో విమర్శల గురించి మాట్లాడదలచుకోలేదంటూ తెలివిగా తప్పించుకున్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ మాటలను అయితే తాను అస్సలు చెట్టించుకోనని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ఇదిలా ఉండగా.. చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం చిరు అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిరు కమ్ బ్యాక్ మూవీ అవుతుందని అభిమానులు ఆశ పడుతున్నారు.