KDP: చింతకొమ్మదిన్నె మండలం ఆర్. కృష్ణాపురంలో 2023లో జరిగిన దాడి కేసులో నిందితుడు సోము శివ ప్రశాంత్కు కడప అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జి.సి.ఆసిఫా సుల్తానా మంగళవారం రెండేళ్ల జైలు శిక్ష, రూ. 20,000 జరిమానా విధించారు. బీరు సీసాతో జగదీష్ అనే యువకుడిపై ప్రాణాంతక దాడి చేసినట్లు నేరం రుజువైన నేపథ్యంలో ఈ శిక్ష పడింది.