Nitin : నితిన్, రష్మిక కొత్త సినిమా గ్రాండ్ గా లాంచ్
భీష్మ (Bheeshma) వంటి సక్సెస్ తరువాత మరోసారి ఆ కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్(Nithiin), రష్మిక(Rashmika Mandanna).. ఒక అడ్వెంచర్స్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా ఇవాళ (మార్చి 24) గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి (Chiranjeevi) గెస్ట్ గా రాగా.. క్లాప్ కొట్టి మూవీకి పచ్చ జెండా ఊపాడు.
భీష్మ (Bheeshma) వంటి సక్సెస్ తరువాత మరోసారి ఆ కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్(Nithiin), రష్మిక(Rashmika Mandanna).. ఒక అడ్వెంచర్స్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా ఇవాళ (మార్చి 24) గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి (Chiranjeevi) గెస్ట్ గా రాగా.. క్లాప్ కొట్టి మూవీకి పచ్చ జెండా ఊపాడు.
హీరో నితిన్, (hero Nitin) హీరోయిన్- రష్మిక మందన్న కాంబినేషన్ లో మరో సారి సినిమా రాబోతుంది. డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు పూజా కార్యక్రమం జరగ్గా.. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది.
నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ’ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘భీష్మ’ నిలిచింది. ఇప్పుడు మరోసారి వారిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
హీరోలైనా, హీరోయిన్లైనా.. కొంతమందికి కొందరి కాంబినేషన్ బాగా కలిసొస్తుంది. వారితో చేస్తే మళ్లీ హిట్ ఖాయమని నమ్మేవాళ్లు కూడా లేకపోలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. గతంలో దర్శకుడు వెంకీ కుడుముల, (Venky Kudumula) హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో ‘భీష్మ’ (Bheeshma) సినిమా వచ్చింది. అప్పట్లో ఈ మూవీ భారీ హిట్ ను అందుకొని నితిన్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇప్పుడు మరోసారి ఈ మ్యాజిక్ కాంబో రిపీట్ కాబోతుంది. ఈ మూవీని ‘మైత్రీ మూవీ మేకర్స్'(Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు నితిన్, రష్మిక మందన్నతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇవ్వగా.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltheru Veeraya) డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
‘వీరసింహారెడ్డి’ (‘Veerasimha Reddy’) దర్శకుడు గోపీచంద్ మలినేని ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఇక దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మైత్రి మూవీ మేకర్స్ తో పాటు, హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.