ఎట్టకేలకు మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. కొంత గ్యాప్ తర్వాత జనవరి 18 నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్‌ను సాలిడ్ యాక్షన్‌తో మొదలు పెట్టిన త్రివిక్రమ్.. లేటెస్ట్ షెడ్యూల్‌ను కూడా భారీ ఫైట్‌తో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ తెరకెక్కింనున్నారట. ఫస్ట్ షెడ్యుల్‌లో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌ను.. కెజియఫ్ సినిమాకు పని చేసిన యాక్షన్ బ్రదర్స్.. అన్బు అరివ్ పని చేశారు. కానీ ఎందుకో మహేష్‌కు వీళ్ల కంపోజింగ్ నచ్చలేదని టాక్. అందుకే ఇప్పుడు.. రామ్ లక్ష్మణ్‌తో భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ రీ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ షూట్ సుమారు రెండు వారాల పాటుగా ఉంటుందట. వచ్చే నెలలో టాకీ పార్ట్ ప్రారంభం కానుందని అంటున్నారు. మొత్తంగా ఎస్ఎస్ఎంబీ 28 టైం స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇకపోతే.. ఈ సినిమాలో పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగష్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రొడ్యూసర్ నాగవంశీ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. మహేష్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే మాటల మాంత్రికుడు ఈ ప్రాజెక్ట్‌ను భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి శోభనను త్రివిక్రమ్ సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.