ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో మెప్పించలేకపోయిన రవితేజ.. ధమాకా సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. ఈ సినిమాతో వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసి.. కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు మాస్ మహారాజా. ఇదే జోష్‌లో అప్ కమింగ్ ఫిల్మ్స్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ధమాకా తర్వాత రవితేజ నుంచి రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రావణాసుర’ డబ్బింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. మాస్ రాజా రవితేజ తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్నట్టు ఒక పిక్‌ని రిలీజ్ చేసారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీం వర్క్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో.. అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా.. ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు రవితేజ. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక రవితేజ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాతో వంశీ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడట రవితేజ. త్వరలోనే దీని పై క్లారిటీ రానుందని అంటున్నారు. మరి ధమాకా జోష్‌లో ఉన్న రవితేజ.. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.