ప్రభాస్ నటిస్తున్నఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్.. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే టీజర్లో గ్రాఫిక్స్ చూసిన నెటిజన్స్.. దర్శకుడిపై మండిపడ్డారు. ఇదేం గ్రాఫిక్స్.. ఇదేం సినిమా.. అని తేల్చేశారు. దాంతో ఎప్పటిలాగే మరోసారి ఆదిపురుష్‌ని పోస్ట్ పోన్ చేశారు. జనవరి 12 నుంచి జూన్ 16కి వాయిదా వేశాడు. వీఎఫ్ఎక్స్ బెటర్మెంట్ కోసం మరింత సమయం కావాలంటూ మూవీ రిలీజ్ ని పోస్ట్‌పోన్ చేశారు. అయినా కూడా జనాలు ఓం రౌత్‌ని నమ్మడం లేదు. జూన్‌లో కూడా ఈ సినిమా రిలీజ్ అవడం కష్టం.. 2024లోనే వస్తుందని అన్నారు. అయితే తాజాగా ఓం రౌత్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్ 16న రిలీజ్ చేస్తామంటూ.. కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.
ఆదిపురుష్ రిలీజ్‌కు ఇంకా 150 రోజులు మాత్రమే ఉంది.. అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాముడిగా ప్రభాస్‌ను చూడాలంటే 150 రోజులు ఆగాల్సిందేనని చెప్పుకొచ్చారు. డేట్ ఇంత క్లారిటీగా చెప్పినా.. సినీ అభిమానులు మాత్రం ఓం రౌత్ ని వదలడం లేదు. నమ్మొచ్చా.. అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఆదిపురుష్ ప్రజెంట్ స్టాటస్ ఏంటి.. ఎలాంటి వర్క్ చేస్తున్నారు.. టీజర్ తప్పితే ఇప్పటివరకు సరైన పోస్టర్ కూడా విడుదల చేయలేదు. ఇప్పటికైనా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలటున్నారు. కొందరైతే.. ఇంకో టీజర్ రిలీజ్ చేయండి అప్పుడు చెప్తాం. సినిమా 150 రోజుల్లో వస్తుందా లేదా.. రాదా అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇంకా టైం తీసుకున్న పర్లేదు. కానీ బాక్సాఫీస్‌ని షేక్ చేయాలంటు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే ఓం రౌత్ ఎలాగు మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చాడు కాబట్టి అనుకున్న సమయానికే ఆదిపురుష్ థియేటర్లోకి రావడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.
ll रामकार्य करने के लिए हम सदैव तत्पर हैं ll || We are always delighted to impart the virtue of Lord Ram ||