తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి భక్తులు వెలుపలో క్యూలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 72,724 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,786 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.