తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండటంలో భక్తులు కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,600 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.