Nizamabad district center, a mother was caught by the police when she saw her child being sold for money.
Viral News: నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో ఓ తల్లి తన రెండు రోజుల బాబును అమ్మేందుకు సిద్ధమైయింది. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు(Police) నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసిపి కిరణ్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గొసంగి దేవి, భర్త ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటుంది. భర్త కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే దేవి గర్భం దాల్చగా బిడ్డను పోషించే స్తోమత లేకపోవడంతో పుట్టిన వెంటనే బిడ్డను అమ్మాలనుకుంది. ఈ విషయాన్ని సలుంకే జయకు తెలిపింది. డబ్బులకు ఆశపడిన జయ నాగారంకు చెందిన అమీనా బేగంకు, ఆటోనగర్ కు చెందిన షబానా బేగంలకు బిడ్డను అమ్మేందుకు బేరం కుదుర్చుకుంది. ఆడబిడ్డ పుడితే లక్ష రూపాయలు, మగబిడ్డ పుడితే లక్షన్నర రేటు నిర్ణయించింది. వారి వద్ద రూ. 5వేలు అడ్వాన్స్ తీసుకుంది.
చదవండి:Pakistan: 45 మంది మహిళలపై స్కూల్ ప్రిన్సిపాల్ దారుణం..వీడియోలు తీసి మరీ!
నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోసంగి దేవి మగబిడ్డకు జన్మనివ్వడంతో డెలివరి ఖర్చు రూ.20 వేలు షబానా బేగంతో కట్టించింది. ఈ నెల 3న సోమవారం సాయంత్రం అంబేద్కర్ కాలనీ చౌరస్తాలో గోసంగి దేవి, ఆశా వర్కర్, సలూరికే జయలు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న మూడవ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పసి కందును విక్రయించేందుకు యత్నించిన తల్లి గోసంగి దేవి, ఆశ వర్కర్ సలూరికే జయ, విక్రయించేందుకు ప్రయత్నించిన అమీనా బేగం, షబానా బేగంలను పోలీసులు అరెస్టు చేశారు. పసికందును ఐసిడిఎస్ సిబ్బందికి అప్పజెప్పి, నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి కిరణ్ కుమార్ తెలిపారు.
చదవండి:Huge fire accident: గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం..లక్షల విలువైన ఆస్తి దగ్ధం

