• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న..MLA, కలెక్టర్

BHPL: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో ప్రజాపాలన-ప్రగతి 99 రోజుల కార్యక్రమం పై గురువారం సర్పంచులు, కౌన్సిలర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MLA GSR, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని మాట్లాడారు. విరిగిన విద్యుత్ పోల్స్, వైర్లు, ఇళ్ల పై నుంచి వెళ్తున్న 11 కేవీ లైన్లు తొలగించి నూతన పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు.

March 12, 2026 / 02:33 PM IST

లింగన్నపాలెంలో పశువులకు గాలికుంటు టీకాలు

KMM: వైరా మండల పరిధిలోని లింగన్నపాలెం గ్రామంలో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 22 ఆవులకు, 155 గేదెలకు పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశువుల యజమానులకు మండల పశువైద్యాధికారి వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు.

March 12, 2026 / 02:32 PM IST

పది పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: ఎంఈవో

KMR: పెద్ద కొడఫ్గల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి మొత్తం 240 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలనR MEO పేర్కొన్నారు.

March 12, 2026 / 02:32 PM IST

ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

KMM: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

March 12, 2026 / 02:32 PM IST

నా ఊరు అనే భావనతో పనిచేయాలి: కలెక్టర్

MDK: నా ఊరు, నా వార్డు అనే భావనతో సర్పంచులు, కౌన్సిలర్లు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. కలెక్టరేట్లో సర్పంచ్లు, కౌన్సిలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గ్రామాలు, వార్డులు అన్ని రంగాలలో ముందుంచేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

March 12, 2026 / 02:31 PM IST

నూతన ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన : MLA

MBNR: రాజాపూర్ మండలం ఇబ్రహీంపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తుందని తెలిపారు.

March 12, 2026 / 02:30 PM IST

పాలకుర్తి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన నేతలు

JN: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డినీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ మాట్లాడుతూ… గొర్రెలు, మేకల సంక్షేమం కోసం బడ్జెట్లో 10వేల కోట్లు కేటాయించాలని, దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ ద్వారా రెండవ విడత గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు.

March 12, 2026 / 02:29 PM IST

గరిడేపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

SRPT: గరిడేపల్లిలోని గుండాలమ్మ గుడి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై వెళ్తున్న లారీ డివైడర్‌పై ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం కూలి ఓ వ్యక్తి తలపై పడడంతో అతనికి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 02:23 PM IST

ప్రజా ప్రతినిధులకు జిల్లాస్థాయి శిక్షణ

GDWL: జిల్లా కేంద్రంలో ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణపై నూతన కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎస్పీ టి. శ్రీనివాసరావు పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జూన్ 12 వరకు సాగే ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని వారు సూచించారు.

March 12, 2026 / 02:22 PM IST

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

NRPT: మక్తల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో పలు గ్రామాలకు చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి చెక్కులు అందజేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు సంతోషంగా జరగాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

March 12, 2026 / 02:19 PM IST

అర్హులైన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని బిక్షాటన

MNCL: బెల్లంపల్లి పట్టణంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ BJP నాయకులు గురువారం షాప్ షాపుకు తిరుగుతూ జోలె పట్టి బిక్షాటన చేశారు. అధికారులు విడుదల చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉందన్నారు. ఇంటికి రూ. 3 లక్షలు వసూలు చేస్తూ జాబితాలో అనర్హులకు చోటు కల్పించారాని వారు ఆరోపించారు.

March 12, 2026 / 02:18 PM IST

మంత్రిని కలిసిన రాజ్యసభ సభ్యుడు

MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి మంత్రి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రితో నరేందర్ రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తదితరులు ఉన్నారు.

March 12, 2026 / 02:16 PM IST

ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరం: కలెక్టర్

NGKL: జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సులో కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

March 12, 2026 / 02:15 PM IST

సిద్దిపేట రైతు బజార్ బంద్

SDPT: సిద్దిపేట పట్టణంలోని రైతుబజార్ శుక్రవారం పూర్తిగా బంద్ ఉంటుందని ఏఎంసీ అధికారి నాగరాజు తెలిపారు. మార్కెట్ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించాలని, తిరిగి శనివారం నుంచి యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

March 12, 2026 / 02:15 PM IST

33వ వార్డులో ’99 రోజుల కార్యచరణ ప్రణాళిక’ ప్రారంభం

సిరిసిల్ల జిల్లాలోని నూతనంగా ఎన్నికైన 33 వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్‌లు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ’99 రోజుల కార్యచరణ ప్రణాళిక’ను ఇవాళ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి దిశగా పనులను కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా తమకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు ఇంఛార్జ్ అలేఖ్య, ఆర్పీలు హేమలత, సునీత, తదితరులు పాల్గొన్...

March 12, 2026 / 02:13 PM IST