GDWL: జిల్లా కేంద్రంలో ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణపై నూతన కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎస్పీ టి. శ్రీనివాసరావు పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జూన్ 12 వరకు సాగే ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని వారు సూచించారు.
NRPT: మక్తల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో పలు గ్రామాలకు చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి చెక్కులు అందజేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు సంతోషంగా జరగాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ BJP నాయకులు గురువారం షాప్ షాపుకు తిరుగుతూ జోలె పట్టి బిక్షాటన చేశారు. అధికారులు విడుదల చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉందన్నారు. ఇంటికి రూ. 3 లక్షలు వసూలు చేస్తూ జాబితాలో అనర్హులకు చోటు కల్పించారాని వారు ఆరోపించారు.
MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి మంత్రి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రితో నరేందర్ రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తదితరులు ఉన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సులో కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
SDPT: సిద్దిపేట పట్టణంలోని రైతుబజార్ శుక్రవారం పూర్తిగా బంద్ ఉంటుందని ఏఎంసీ అధికారి నాగరాజు తెలిపారు. మార్కెట్ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించాలని, తిరిగి శనివారం నుంచి యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
సిరిసిల్ల జిల్లాలోని నూతనంగా ఎన్నికైన 33 వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్‌లు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ’99 రోజుల కార్యచరణ ప్రణాళిక’ను ఇవాళ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి దిశగా పనులను కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా తమకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు ఇంఛార్జ్ అలేఖ్య, ఆర్పీలు హేమలత, సునీత, తదితరులు పాల్గొన్...
MBNR: దేవరకద్ర మండలం పాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి మెగా వైద్య శిబిరాలు గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన యువతీ, యువకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ASF: జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హరిత స్థానిక ప్రభుత్వ స్పోర్ట్స్ మోడల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి విద్యా ప్రమాణాలను, క్రీడా సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, మెనూ ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
MDK: మెదక్ కలెక్టరేట్‌లో 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై ఇవాళ సర్పంచ్లు, కౌన్సిలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కలెక్టర్ ప్రతిమా సింగ్ తిలకించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలను ఫోటోల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రావు, అడిషనల్ కలెక్టర్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.
JGL: మహిళలు క్రీడల్లో రాణించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ యూత్ స్పోర్ట్స్ అథారిటీ ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆస్మిత ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ఆస్మిత లీగ్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, DYSO రవి కుమార్, కౌన్సిలర్ లక్ష్మ పాల్గొన్నారు.
MNCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 19డివిజన్ పరిధి అండాలమ్మ కాలనీలోని ఈద్గాలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం బ్లేడ్ ట్రాక్టర్‌తో ఈద్గా స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు. రంజాన్ రోజున పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రార్థనలు చేస్తారు.
NZB: ధర్పల్లికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు జి.కిషోర్ రెడ్డి (42) గురువారం కన్నుమూశారు. ఉదయం పొలం వద్ద వాకింగ్ ముగించుకుని వచ్చి నిద్రపోయిన ఆయన, ఎంతకీ లేవకపోవడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
KMR: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
WNP: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి వనపర్తి డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.