JN: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రాడపాక లింగయ్య తండ్రి రాడపాక కొమురయ్య గురువారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దయాకర్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
WGL: గీసుగొండ మండలం మరియపురంలో గురువారం 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, మేయర్ సుధారాణి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్ధన్నపేట, నర్సంపేట ఛైర్పర్సన్లు సారంగపాణి, పెండ్యాల లక్ష్మీ, డీసీపీ అంకిత్ కుమార్, DFOఅనుజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
NLG: హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగే ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ ఛైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఛైర్మెన్ బోడ స్వామి ఆధ్వర్యంలో పలువురు బయలుదేరారు. చిట్యాల కనకదుర్గమ్మ గుడి ఆవరణ నుండి ఈ బృందం ఉత్సాహంగా తరలివెళ్లింది.
BDK: 99 రోజుల ప్రణాళికలో భాగంగా రామవరం జాతీయ రహదారిపై పోలీస్ సిబ్బంది గురువారం మానవహారం నిర్వహించారు. మత్తు పదార్థాల బారిన పడి యువత తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని కొత్తగూడెం టూ టౌన్ ప్రతాప్ సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను గురించి వివరించారు. డ్రగ్స్ గంజాయి వంటి మహమ్మారి బారిన పడకుండా ఉండాలని సూచించారు.
BHPL: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో ప్రజాపాలన-ప్రగతి 99 రోజుల కార్యక్రమం పై గురువారం సర్పంచులు, కౌన్సిలర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MLA GSR, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని మాట్లాడారు. విరిగిన విద్యుత్ పోల్స్, వైర్లు, ఇళ్ల పై నుంచి వెళ్తున్న 11 కేవీ లైన్లు తొలగించి నూతన పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు.
KMM: వైరా మండల పరిధిలోని లింగన్నపాలెం గ్రామంలో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 22 ఆవులకు, 155 గేదెలకు పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశువుల యజమానులకు మండల పశువైద్యాధికారి వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు.
KMR: పెద్ద కొడఫ్గల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి మొత్తం 240 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలనR MEO పేర్కొన్నారు.
KMM: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
MDK: నా ఊరు, నా వార్డు అనే భావనతో సర్పంచులు, కౌన్సిలర్లు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. కలెక్టరేట్లో సర్పంచ్లు, కౌన్సిలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గ్రామాలు, వార్డులు అన్ని రంగాలలో ముందుంచేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
MBNR: రాజాపూర్ మండలం ఇబ్రహీంపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తుందని తెలిపారు.
JN: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డినీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ మాట్లాడుతూ… గొర్రెలు, మేకల సంక్షేమం కోసం బడ్జెట్లో 10వేల కోట్లు కేటాయించాలని, దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ ద్వారా రెండవ విడత గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు.
SRPT: గరిడేపల్లిలోని గుండాలమ్మ గుడి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై వెళ్తున్న లారీ డివైడర్‌పై ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం కూలి ఓ వ్యక్తి తలపై పడడంతో అతనికి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GDWL: జిల్లా కేంద్రంలో ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణపై నూతన కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎస్పీ టి. శ్రీనివాసరావు పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జూన్ 12 వరకు సాగే ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని వారు సూచించారు.
NRPT: మక్తల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో పలు గ్రామాలకు చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి చెక్కులు అందజేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు సంతోషంగా జరగాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ BJP నాయకులు గురువారం షాప్ షాపుకు తిరుగుతూ జోలె పట్టి బిక్షాటన చేశారు. అధికారులు విడుదల చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉందన్నారు. ఇంటికి రూ. 3 లక్షలు వసూలు చేస్తూ జాబితాలో అనర్హులకు చోటు కల్పించారాని వారు ఆరోపించారు.