• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరిన జనాలు

BDK: మణుగూరు మండలం పీవీ కాలనీలోని గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ వినియోగదారులు ఉదయం బారులు తీరారు. పూర్తి స్థాయిలో గ్యాస్ నిల్వలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. గ్యాస్ సిలిండర్లతో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమ వ్యక్తిగత పనులను సైతం వదులుకొని గ్యాస్ గోడౌన్ ఉండాల్సి వస్తుందన్నారు.

March 17, 2026 / 12:37 PM IST

కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల బైఠాయింపు

NGKL: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు మూడు రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆశా వర్కర్లను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. 

March 17, 2026 / 12:33 PM IST

జర్నలిస్టులకు శిక్షణ ప్రారంభించిన కలెక్టర్

SRD: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ‘వార్తా మిలాప్” పేరుతో జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజులపాటు జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని పీఐబీ అసిస్టెంట్ డైరెక్టర్ శృతి పాటిల్ తెలిపారు.

పారిశుద్ధ పనులు పర్యవేక్షించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

MHBD: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 9వ వార్డులో మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన సూచించారు. వార్డు కౌన్సిలర్ నీలా లచ్చిరాం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులున్నారు.

March 17, 2026 / 12:32 PM IST

ఆశా కార్యకర్తల ఆందోళన

NRML: ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఆశా వర్కర్లు కదం తొక్కారు. పారితోషికం స్థానంలో వేతనాలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సోమవారం నుంచి మంగళవారం వరకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట 48 గంటల నిరసన చేపట్టారు.

March 17, 2026 / 12:32 PM IST

కురవిలో ఖాళీ సిలిండర్లతో నిరసన..

MHBD: కురవిలో ఖాళీ సిలిండర్లతో CPI పార్టీ నేతలు నిరసన చేపట్టారు. CPI స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ వైఫల్యం వల్లనే గ్యాస్ కొరత ఏర్పడి ధరలు పెరిగాయని, భారతదేశంలోని ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 12:31 PM IST

శివాజీ జంక్షన్‌ను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఛైర్మన్

HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీపేట వద్ద శివాజీ జంక్షన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ సునీల్ కుమార్ అన్నారు. రాజీపేట వద్ద శివాజీ విగ్రహ మరమ్మత్తు పనులు, జంక్షన్‌ను అధికారులతో కలిసి ఛైర్మన్ పరిశీలించారు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.

‘వడ్లు కొనలేం.. వరి పంట సాగు చేయడం బంద్ చేయండి’

KMM: వడ్లు కొనలేమని వరి పంట సాగు చేయడం బంద్ చేయాలని మంగళవారం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు. వడ్లు కొనుగోలు చేయబోమని ఇకపై రైతులు మీ ఇష్టం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్తుందని వెల్లడించారు. మరీ వేస్తే నీటి సమస్య కూడా ఏర్పడుతుందని అయితే అర్థం చేసుకోవాలని సూచించారు.

March 17, 2026 / 12:30 PM IST