NGKL: వనపర్తిలో జరిగిన కవి సమ్మేళనంలో బిజినపల్లి మండలానికి చెందిన ప్రముఖ కవి డాక్టర్ ప్రతాప్ కౌటిల్యను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనకు ప్రశంసా పత్రం, మెమెంటో అందజేశారు. ఉమ్మడి జిల్లాలోని పలువురు కవులు ఈ సమ్మేళనంలో పాల్గొని అలరించారు.
ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజనీతి శాస్త్ర విభాగం అద్వర్యంలో మంగళవారం ఉట్నూర్ ITDA కార్యాలయాన్ని సందర్శించారు. ఆదివాసి గిరిజన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలపై G.S.U.K (గిరిజన శిక్షణ ఉపాది కేంద్రం) అధికారి కె.నాగభూషణం, (J.D.M) డి. వినోద్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో మంగళవారం నిత్య ఆర్జిత సేవలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం వైభవంగా అర్చకులు నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన నరసింహ హోమం అనంతరం నిత్య కళ్యాణం చేపట్టారు. భక్త దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
GDWL: మల్దకల్ మండలం కుర్తి రావుల చెరువు గ్రామ అభివృద్ధిలో అందరూ తోడ్పడాలని సర్పంచ్ భగవంతు పిలుపునిచ్చారు. మంగళవారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అంతర్గత రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టామని, వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
NLG: దేవరకొండలో బీజేపీ రూరల్ మండలం ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు నేనావత్ రామునాయక్ మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణంలోనూ ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా నిరంతరం జరుగుతుందని అన్నారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో కూడా దేశ ప్రజలకు ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదన్నారు.
MDCL: ఉప్పల్ పరిధిలో పిల్లి, కుక్క కాటుకు గురైన వారు అశ్రద్ధ చేయకండి. రింగ్ రోడ్డు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో రేబీస్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. బాధితులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని వైద్యుల సూచనల మేరకు టీకాలు వేయించుకోవాలని అధికారులు సూచించారు. ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకుంటే ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు.
KMR: ఇటీవల ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి నిరాశ్రయుడైన రైతు మచ్కురి కిష్టయ్యకు అన్నారం గ్రామస్థులు అండగా నిలిచారు. గ్రామ యువత చొరవతో విరాళాలు సేకరించి రూ.30,000 ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండటం మన కర్తవ్యమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. బాధితుడికి భరోసానిస్తూ యువత చాటిన మానవత్వాన్ని పలువురు అభినందించారు.
NZB: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాను మంగళవారం చందూర్ మండలం ఘన్ పూర్ గ్రామ ముస్లింలకు తహసీల్దార్ వీర్ సింగ్, ఘన్ పూర్ సర్పంచ్ ముత్తకుంట కృష్ణ అందజేశారు. ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేడు రూ.50 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. మార్కెట్‌కు మొత్తం 24 వాహనాల్లో 145 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
SDPT: హుస్నాబాద్ పట్టణ శివారులోని వ్యవసాయ పొలాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైతుల బోర్ల వద్ద ఉన్న సుమారు 30 మోటార్ల కేబుల్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఎండకాలంలో నీటి కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో, వరుస దొంగతనాలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని అన్నారు. దొంగతనాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
MNCL: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ పార్దివదేహానికి లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలకు చెందిన నాయకులు, ప్రజలు నివాళి అర్పిస్తున్నారు. మంగళవారం దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఉంచిన పార్థివ దేహాన్ని వారు సందర్శించారు. జన్నారం మండల మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.
RR: ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత ఇస్తోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మియాపూర్ మెట్రో గ్రౌండ్‌లో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్‌కు హాజరుకావాలని స్థానిక యువజన నాయకులు ఆయనను కోరారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను ఇచ్చారు.
KMR: డ్వాక్రా సంఘాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై లింగంపేటలో మహిళా సంఘాల సభ్యులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటాలకు మంగళవారం పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
NRML: నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన మంగళవారం మరింత ఉదృతమైంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
NRML: నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన మంగళవారం మరింత ఉదృతమైంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.