• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే

BDK: చండ్రుగొండ మండల రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు అందజేస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

March 12, 2026 / 03:33 PM IST

రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్

SRPT: సూర్యాపేట డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో ఖాళీగా ఉన్న 15 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డీఓ వేణుమాధవరావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18-40 ఏళ్ల లోపు ఉన్న స్థానికులు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 14 వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆత్మకూర్.ఎస్, సూర్యాపేట తదితర మండలాల్లో ఖాళీలు ఉన్నట్లు RDO వెల్లడించారు.

March 12, 2026 / 03:33 PM IST

‘ఉపసర్పంచుల ‘చెక్ పవర్’ రద్దు చేయాలి’

RR: గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్న ఉపసర్పంచుల ‘చెక్ పవర్’ను రద్దు చేయాలని సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో వారు సంతకాలు చేయకపోవడంతో డ్రైనేజీలు, వీధి దీపాల పనులు నిలిచిపోతున్నాయని కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. చెక్ పవర్ బాధ్యతను కార్యదర్శి లేదా ఎంపీడీవోకు ఇవ్వాలని కోరారు.

March 12, 2026 / 03:31 PM IST

శిక్షణ తరగతులకు హాజరైన పాలకవర్గం సభ్యులు

MDK: జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు రామాయంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ ఛైర్ పర్సన్ పోచమ్మ నవనీత గణేష్‌తో పాటు కౌన్సిలర్‌లు హాజరయ్యారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికతో పాటు మున్సిపల్ పాలకవర్గం విధులు, వారి బాధ్యతలపై అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం నూతనంగా ఎంపికైన వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

March 12, 2026 / 03:30 PM IST

కవ్వంపల్లి పదవీ స్వీకారోత్సవానికి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

KNR: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ స్వీకారోత్సవానికి గురువారం కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. పరిధిలోని మండలాల నుంచి పార్టీ నాయకులు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

March 12, 2026 / 03:29 PM IST

‘అక్రమ కొండల త్రవ్వకలను నిలుపుదల చేయాలి’

KMM: కారేపల్లి మండలం గుట్ట కింద గుంపు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ కొండల తవ్వకాలను అడ్డుకోవడంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవీందర్ పూర్తిగా విఫలమయ్యారని BGBPS అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ధ్వజమెత్తారు. గురువారం కొత్తగూడెంలోని ప్రాంతీయ కార్యాలయంలో అధికారి రవీందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

March 12, 2026 / 03:28 PM IST

ఫోటో ఎగ్జిబిషన్‌ను వీక్షించిన.. MLA, కలెక్టర్

BHPL: “ప్రజాపాలన-ప్రగతి” కార్యక్రమంలో భాగంగా ఇవాళ BHPL పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు DPRO శ్రీనివాసరావు ఈ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే ఫోటోలను MLA గండ్ర, కలెక్టర్ వీక్షించారు.

March 12, 2026 / 03:27 PM IST

డ్రగ్స్ వాడకంతో కుటుంబాలు చిన్నాభిన్నం

BDK: చండ్రుగొండ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విశేష కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ వాడటం వల్ల అనారోగ్యంతో పాటు కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయన్నారు.

March 12, 2026 / 03:23 PM IST

వార్డులో ముమ్మరంగా పారిశుధ్య పనులు

MNCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కూతురు ప్రభాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు డ్రైనేజీలు, పబ్లిక్ శౌచాలయాలను శుభ్రం చేశారు.

March 12, 2026 / 03:23 PM IST

‘రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందించాలి’

SRCL: అంగన్వాడి టీచర్లు, ఆయాలు రిటైర్ అయి రెండు సంవత్సరాలు గడిచిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందించకుండా కాలయాపన చేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

March 12, 2026 / 03:22 PM IST

38.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదు

ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. గురువారం కాగజ్ నగర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ 37 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

March 12, 2026 / 03:21 PM IST

99 రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

WNP: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌గా 5 దశల్లో 5 ప్రత్యేక కార్యక్రమాలు 99 రోజులు జరుగుతాయని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రతి కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, అందరం అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు.

March 12, 2026 / 03:20 PM IST

శిక్షణ తరగతులు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు మంచి అవకాశం అని కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన శిక్షణ తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలకం అనే భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అన్నారు.

March 12, 2026 / 03:20 PM IST

ఆరోగ్య సేవలను పరిశీలించిన ఎమ్మెల్యే

NGKL: జిల్లాలో 18వ వార్డు బస్తీ దవాఖానలో గురువారం ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. గర్భిణీలు, స్థానిక ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.

March 12, 2026 / 03:16 PM IST

గద్వాలలో ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన

GDWL: పట్టణాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తోందని నోడల్ అధికారి నారాయణరావు తెలిపారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

March 12, 2026 / 03:15 PM IST