SRCL: అంగన్వాడి టీచర్లు, ఆయాలు రిటైర్ అయి రెండు సంవత్సరాలు గడిచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకుండా కాలయాపన చేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.