• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మాజీ ఎంపీటీసీని పరామర్శించిన ఎమ్మెల్యే

WGL: నెక్కొండ మాజీ ఎంపీటీసీ ఈదునూరి కరిష్మాను మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబానికి కాంగ్రెస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:28 PM IST

జాతీయస్థాయిలో రాణించాలి: ఉపకులపతి

MBMR: పాలమూరు యూనివర్సిటీ మహిళా క్రాస్ కంట్రీ జట్టు AIU యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి మంగళూరు యూనివర్సిటీకి బయలుదేరింది. ఈ పోటీలు ఫిబ్రవరి 26-28 వరకు జరుగనున్నాయి. ఉపకులపతి ప్రో జి.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారిణులకు ట్రాక్ షూట్లు, యూనిఫామ్‌లు అందజేసి జాతీయ స్థాయిలో రాణించి యూనివర్సిటీకి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

February 24, 2026 / 01:26 PM IST

FLASH: జిల్లాల్లో యూరియా బస్తాలు.. UPDATE

MDCL: ఫిబ్రవరి 24 వరకు యూరియా నిల్వల పై ఫెర్టిలైజర్ యాప్ తాజా సమాచారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,71,041 యూరియా బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా వికారాబాద్‌లో 10,991 బ్యాగులు, రంగారెడ్డిలో 16,809 బ్యాగులు, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 8,263 బ్యాగులు నిల్వలో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులు అవసరమైన మేరకు బుక్ చేసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 01:25 PM IST

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జీఎం సంజయ్ కుమార్

HYD: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నేడు కాచిగూడ రైల్వే స్టేషన్ను అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎమ్ సంతోష్ కుమార్ వర్మ జనరల్ మేనేజర్‌కు తోడుగా ఉన్నారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై అధికారులు చర్చించారు.

February 24, 2026 / 01:20 PM IST

ఉత్సాహంగా తెలుగు టీఎల్ఎం మేళా

NZB: ముబారక్ నగర్ కాంప్లెక్స్ పరిధిలో మంగళవారం నిజామాబాద్ గ్రామీణ మండలాల తెలుగు ఉపాధ్యాయులు రూపొందించిన బోధన అభ్యసన సామాగ్రి (TLM) ప్రదర్శన నిర్వహించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు హన్మంత్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థం కావడానికి టీఎల్ఎం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

February 24, 2026 / 01:20 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం

KMM: ఖమ్మం వెలుగుమట్ల పరిధిలో ఉన్న 60 ఎకరాల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న సుమారు 600 పేద కుటుంబాలపై వేలాది మంది పోలీసులతో దాడి చేసిన ఘటనపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీల సహాయంతో గుడిసెలను కూల్చివేయడం అమానుషం, అతిక్రూరంగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని అన్నారు.

February 24, 2026 / 01:17 PM IST

​మోతెలో VOA భవనానికి శంకుస్థాపన చేసిన కీసర సంతోష్ రెడ్డి

SRPT: మోతె మండల కేంద్రంలో పొదుపు సంఘం (VOA) భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచ్ దోసపాటి అనురాధ, ఉప సర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భవన నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల కార్యకలాపాలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు.

February 24, 2026 / 01:16 PM IST

బాచుపల్లి దోమల బెడదతో నిద్రలేని రాత్రులేన్నో..!

MDCL: బాచుపల్లిలో దోమల బెడద రోజు రోజుకీ పెరుగుతోంది. సాయంత్రం అయ్యే సరికి కాలనీల్లో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. చెరువులు, నిల్వ నీరు, శుభ్రం చేయని డ్రైన్లు సమస్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. డెంగ్యూ భయంతో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే ఫాగింగ్ చేపట్టి పరిసరాల శుభ్రత పై చర్యలు తీసుకోవాలి.

February 24, 2026 / 01:14 PM IST

‘రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం..!’

MDK: రైతుల పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం ముందస్తుగా సాగునీరు విడుదల చేసిందని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ముందస్తుగా సాగునీరు విడుదల చేసిందని తెలిపారు.

February 24, 2026 / 01:13 PM IST

‘ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు’

BHNG: జిల్లాలో రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కె.నరసింహ ఈరోజు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందని, పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, మొబైల్ ఫోన్లు నిషిద్ధమని స్పష్టం చేశారు.

February 24, 2026 / 01:13 PM IST

‘ఇంటి, నీటి పన్నుల బకాయిలు చెల్లించాలి’

MNCL: బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటిపన్ను బకాయిలు ఉన్నవారు ముందస్తుగా చెల్లిస్తే వడ్డీ నుంచి ఉపశమనం పొందవచ్చునన్నారు. కావున బకాయిలు ఉన్నవారు సకాలములో బిల్ కలెక్టర్లకు గాని,ఆఫీస్ కౌంటర్లో గాని చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

February 24, 2026 / 01:12 PM IST

ఒకే దూరం.. భారీ వ్యత్యాసం.!

VKB: తాండూర్ నుంచి హైదరాబాద్‌కు 110 కిలోమీటర్లు బస్సు ఛార్జ్ రూ.160 అదే రైలు ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ రూ. 55 ఉంది. బస్సులో వెళ్లే వారికి తీవ్రంగా కాలయాపన జరుగుతుండగా అదే రైల్లో వెళ్లే వారికి అతి తక్కువ సమయంలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. రైలు ఛార్జ్ కేవలం రూ. 55 ఉండి ఉండగా బస్సు ఛార్జీ రూ.160 ఉండటంతో ఉన్నతాధికారులు ఆలోచించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

February 24, 2026 / 01:12 PM IST

దుబ్బగూడెంలో భారీ చోరీ

BHPL: మహదేవపూర్(M)దుబ్బగూడెంలో సోమవారం రాత్రి భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక రైతు పోత సమ్మయ్య ఇంట్లో గుర్తు తెలియని చొరబడి బీరువా తెరిచి 30 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. కూతురి వివాహం కోసం ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన సొమ్మును కోల్పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

February 24, 2026 / 01:10 PM IST

డీఎస్పీని కలిసిన నూతన కౌన్సిలర్

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన 14వ వార్డు కౌన్సిలర్ బొల్లారపు స్వప్న గిరిధర్, డీఎస్పీ రఘుచంధర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశం జగిత్యాల పట్టణంలో జరిగింది. ఈ కలయికలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.

February 24, 2026 / 01:09 PM IST

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

SDPT: జగదేవ్ పూర్ మండలం అలీరాజ్పేటలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి తిరుపతి, వ్యవసాయ అధికారి వసంతరావు, యువరైతు శ్రీనాథ్ రైతులకు ప్రకృతి సేద్యంలోని మెళకువలను వివరించారు. రసాయన రహిత సాగుతో భూసారం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు.

February 24, 2026 / 01:08 PM IST