• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

FLASH.. భారీగా చిక్కిన విదేశీ మద్యం

MDK: నర్సాపూర్ మండలం కాగజ్మద్దూర్ శివారులో భారీగా విదేశీ మద్యం పట్టుబడటం కలకలం రేపింది. స్థానిక బయో మెడికల్ వ్యర్థాల పరిశ్రమలో నిల్వ ఉంచిన ఈ మద్యాన్ని ఆబ్కారీ అధికారులు మెరుపు దాడి చేసి గుర్తించారు. ఇతర దేశాలకు చెందిన ఈ బ్రాండ్లు ఇక్కడికి ఎలా వచ్చాయి.? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు..? అనే కోణంలో ఎక్సైజ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

February 24, 2026 / 04:03 PM IST

సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం

అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ వెంటనే చేయడం వలన మనిషిని బతికించే అవకాశాలు పెరుగుతాయని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం మొబైల్ హెల్త్ టీమ్స్ కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొబైల్ హెల్త్ టీమ్ సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించామన్నారు.

February 24, 2026 / 04:01 PM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడుకి గాయాలు

KNR: కులవృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడటంతో ఓ గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. రామడుగు మండలంలోని చిప్పకుర్తి గ్రామానికి చెందిన బుర్ర లచ్చయ్య గౌడ్ మంగళవారం ఉదయం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

February 24, 2026 / 04:01 PM IST

విద్యార్థులకు మానసిక సమస్యలపై అవగాహన

కామారెడ్డిలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు మానసిక సమస్యలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు HM రమణా రెడ్డి తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షా కాలంలో ప్రణాళిక వేసుకొని సంసిద్ధమై, నేర్చుకున్న అంశాలను పునఃశ్చరణ చేయడం ద్వారా మానసిక సమస్యలను అధిగమించవచ్చు అన్నారు.

February 24, 2026 / 04:00 PM IST

ఎంపీ అర్వింద్‌కు కీలక బాధ్యత

NZB: పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా NZB ఎంపీ అర్వింద్ మంగళవారం నియమితులయ్యారు. ఈ గ్రూప్ ద్వారా భారత్, ఉక్రెయిన్ దేశాల మధ్య పార్లమెంటరీ స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, అలాగే విద్య, వాణిజ్యం, సాంస్కృతిక రంగాలలో సహకార అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

February 24, 2026 / 04:00 PM IST

పోలీస్ విజేతలను సత్కరించిన ఎస్పీ

NLG: 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో NLG జిల్లా పోలీస్ సిబ్బంది పలు విభాగాల్లో మెడల్స్ సాధించి ప్రతిభ చాటారు. ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజేతలను అభినందించి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

February 24, 2026 / 04:00 PM IST

నష్టపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి

జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన ఆకాల వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది. ఈ సందర్భంగా రాయికల్ మండలం రామోజీపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షానికి నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కోరారు.

February 24, 2026 / 03:48 PM IST

ఇంటర్ పరీక్షల్లో కఠిన నిబంధనలు: జిల్లా అధికారి హెచ్చరిక

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా అధికారి వీరేందర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ వాచ్‌లు, సెల్‌ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని ఆదేశించారు. పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో జిరాక్స్ షాపులు తెరిచి ఉంచకూడదని సూచించారు.

February 24, 2026 / 03:46 PM IST

54 పతకాలతో క్రీడాకారుల సత్తా చాటారు: కలెక్టర్

BDK: సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు 54 పతకాలు సాధించి ప్రతిభ చాటారు. ఈ విజయాలు జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అభినందించారు. క్రీడాకారులకు మరింత శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

February 24, 2026 / 03:44 PM IST

గుండె పోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

RR: వయసుతో సంబంధంలేకుండా నమోదవుతున్న గుండెపోటు మరణాలు వేధిస్తున్నాయి. ఇబ్రహీంపట్న పరిధి మంచాలలోనూ సోమవారం ఓ పసి గుండె ఆగింది. స్థానికుల వివరాలు.. ఆగపల్లి గ్రామానికి చెందిన యాదవరావు కూతురు నిహారిక (13) ఛాతిలో నొప్పితో తల్లడిల్లుతుంటే నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.

February 24, 2026 / 03:43 PM IST

‘రక్షణలోనే కాదు.. క్రీడల్లోనూ మేమే సాటి’

GDWL: నిరంతరం విధి నిర్వహణలో ఉంటూనే, క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపి గద్వాల్ జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడం గర్వకారణం అని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. సైబరాబాద్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో గద్వాల పోలీసులు 4 స్వర్ణ, 8 కాంస్య పతకాలతో సత్తా చాటారు. మంగళవారం విజేతలను ఎస్పీ అభినందించారు.

February 24, 2026 / 03:40 PM IST

దోమల మందు పిచికారి చేయాలని వినతి

NRPT: మరికల్ మండలంలోని మాధవరం గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని దోమల నివారణకై దోమల మందు పిచికారి చేయాలని యువకులు మంగళవారం గ్రామ సర్పంచ్ మొగులప్పకు వినతి పత్రాన్ని సమర్పించారు. దోమలతో పాటు పందుల బాధలు నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, రాజు, రాము, చెన్నకేశవులు, ఆంజనేయులు ఇచ్చిన వారిలో ఉన్నారు.

February 24, 2026 / 03:39 PM IST

బడేంపల్లిలో తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం

VKB: దోమ మండలంలోని బడేంపల్లిలో తాగునీటి బోర్ మోటార్ కాలిపోవడంతో గ్రామంలో నీటి సమస్య తలెత్తింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గడ్డం శంకర్ వెంటనే స్పందించి నూతన మోటార్ అమర్చే పనులను చేపట్టించారు. తక్షణ చర్యలతో మోటార్‌ను బిగించి గ్రామస్థులకు తిరిగి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. సర్పంచ్ వేగవంతమైన చర్యలకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

February 24, 2026 / 03:39 PM IST

ఆడే గజేందర్‌ను కలిసిన రాంనగర్ గ్రామస్థులు

ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్‌ను మంగళవారం రాంనగర్ గ్రామస్థులు మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్టుగా గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.

February 24, 2026 / 03:38 PM IST

డ్రైవర్‌పై కేసు ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని ధర్నా

ASF: రెబ్బెన మండలం గోలేటిలో గతంలో జరిగిన RTC బస్ ఆక్సిడెంట్‌లో RTC డ్రైవర్ రామారావుకు సంబంధం లేకున్న బాధ్యులుగా చూపించి రిమాండ్‌కు పంపించారని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసిఫాబాద్ బస్టాండ్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. రామారావుపై పెట్టిన కేసు ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 03:38 PM IST