VKB: దోమ మండలంలోని బడేంపల్లిలో తాగునీటి బోర్ మోటార్ కాలిపోవడంతో గ్రామంలో నీటి సమస్య తలెత్తింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గడ్డం శంకర్ వెంటనే స్పందించి నూతన మోటార్ అమర్చే పనులను చేపట్టించారు. తక్షణ చర్యలతో మోటార్‌ను బిగించి గ్రామస్థులకు తిరిగి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. సర్పంచ్ వేగవంతమైన చర్యలకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.