• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రైతుబంధు ఇక లేనట్లే..!

KMM: క్యాబినెట్ మీటింగ్‌లో రైతుబంధు ప్రస్తావన ఈసారి కూడా రాలేదు. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతుబంధు ఎన్నికలు అయిపోయి పొలంలో నాట్లు వేయడం కూడా అయ్యేవరకు రైతుల ఖాతాలోకి జమ కాలేదు. క్యాబినెట్ మీటింగ్‌కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు ఇస్తామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కానీ నేడు ఆ ప్రస్తావన లేదు.

February 24, 2026 / 02:28 PM IST

పసిపాప మృతికి నిరసనగా బీసీ కుల సంఘాల ఆందోళన

NZB: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మృతికి నిరసనగా మంగళవారం NZBలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం, రజక ఐక్య వేదిక, వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్లో మానవహారం ఏర్పాటు చేసి రోడ్డుపై బైఠాయించారు.

February 24, 2026 / 02:20 PM IST

బహదూరురాలో నిలిచిన నీరు.. అధికారుల చర్యలు

HYD: రామదేవ్ ఆలయం సమీపంలో రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం హైడ్రా సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

February 24, 2026 / 02:20 PM IST

ఈనెల 27న కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది సభ

NLG: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చినారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజా ఉద్యమాలు చేసేది కమ్యూనిస్టులే అన్నారు.

February 24, 2026 / 02:19 PM IST

‘పైప్ లైన్లకు మరమ్మతులు చేయించాలి’

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ల లీకేజీలకు మరమ్మతులు చేయించాలని స్థానిక కౌన్సిలర్ శనిగారపు చిన్నయ్య సూచించారు. మంగళవారం మున్సిపల్ అధికారులతో కలిసి వార్డులోని పలు కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు లీక్ అవుతున్నాయని, నీరు వృధాగా పోతుందన్నారు.

February 24, 2026 / 02:16 PM IST

గ్రామాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం ప్రారంభం

JGL: నూకపల్లి నాక్ సెంటర్‌లో ఎండపల్లి, వెల్గటూర్, బుగారం, కొడిమ్యాల మండలాలకు చెందిన సర్పంచ్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. గ్రామాభివృద్ధి ప్రణాళికలు, పంచాయతీ రాజ్ చట్టాలు, నిధుల సమర్థ వినియోగం, గ్రామసభల నిర్వహణ, పారదర్శక పరిపాలన వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.

February 24, 2026 / 02:15 PM IST

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని చెరువులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు గల్లంతైన దుబ్బ నవీన్(30), ఎడ్ల యాదగిరి(24) ఆచూకీ ఇంకా లభించకపోవడంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలన్నారు. అలాగే మృతదేహాలు త్వరితగతిన లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

February 24, 2026 / 02:12 PM IST

‘ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి’

NRML: జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు మార్చి 18 వరకు, పది పరీక్షలు ఏప్రిల్ 16 వరకు 47 కేంద్రాలలో జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

February 24, 2026 / 02:12 PM IST

బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించండి సారూ

MDK: నిజాంపేట మండలం నందిగామలో కుంగిన బ్రిడ్జి ప్రయాణికులకు శాపంగా మారింది. అధికారులు వేసిన తాత్కాలిక రహదారి అధ్వానంగా తయారవ్వడంతో రామాయంపేట-సిద్దిపేట మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల వాహనాలు తిరిగే ఈ మార్గంలో భారీ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత బ్రిడ్జి పనులు ప్రారంభించాలని కోరారు.

February 24, 2026 / 02:07 PM IST

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: హరీశ్ రావు

SDPT: రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థులకు మాజీ మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని, భయపడద్దని సూచించారు. కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మీ మంచి భవిష్యత్‌కు ఇది పునాది లాంటిదని, పరీక్షలు బాగా రాయాలని కోరారు.

February 24, 2026 / 02:05 PM IST

‘పటిష్ట బందోబస్తు మధ్య ఇంటర్ పరీక్షలు’

GDWL: ఇంటర్ పరీక్ష సెంటర్ల వద్ద ఎవరైనా అల్లరి చేసినా లేదా కాపీయింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

February 24, 2026 / 02:05 PM IST

మండలం ఏర్పాటులో గందరగోళం.. ప్రజలకు తిప్పలు

SRPT: అనంతగిరి మండలంలో రెవెన్యూ, పోలీస్ పరిధుల మధ్య సమన్వయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో 19 గ్రామాలతో మండలం ఏర్పడినా, తిమ్మాపురం, తమ్మరబండపాలెం వంటి గ్రామాల్లో గందరగోళం నెలకొంది. రెవెన్యూ పనులకు ఒకే చోట, పోలీస్ సేవల కోసం మరోచోట వెళ్లాల్సి వస్తుంది. ఈ విభజన సమస్యను పరిష్కరించి పాలనను క్రమబద్దీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

February 24, 2026 / 02:03 PM IST

ఆధునిక గోదాముకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో 18,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ గోదాము నిర్మాణానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పంట నిల్వ సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యమని అన్నారు.

February 24, 2026 / 02:01 PM IST

కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి

కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవీందర్ గౌడ్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కామారెడ్డిని అనారోగ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వైద్యాధికారిని కోరారు.

February 24, 2026 / 02:00 PM IST

రేపే మెగా జాబ్ మేళా

NZB: జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బీ.ఫార్మా, డీ. ఫార్మా, ఎం. ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.

February 24, 2026 / 02:00 PM IST