WNP: రాబోయే రోజుల్లో ప్రజల భూసమస్యల పరిష్కారంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని, కాబట్టి నూతన లైసెన్సు సర్వేయర్లు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఇవాళ జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
NGKL: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, న్యాయవాదులు కృష్ణయ్య, ప్రశాంత్, జంగయ్య తదితరులు కూర్చున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే న్యాయవాదుల రక్షణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
VKB: దోమలో MLA రామ్మోహన్‌రెడ్డి సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో మహిళా డ్వాక్రా వర్క్ షెడ్జ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు సర్పంచ్ మాలి శివకుమార్‌రెడ్డి తెలిపారు. మహిళల స్వయం ఉపాధి అభివృద్ధికి ఈ వర్క్ షెడ్జ్ ఉపయోగపడుతుందని, మహిళా సంఘాల కార్యకలాపాలకు తోడ్పడుతుందన్నారు. వార్డు సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
SDPT: రజకులపై జరిగిన దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెజ్జంకి మండల రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని మండల అధ్యక్షుడు ధీటి రాజు డిమాండ్ చేశారు. వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
MDCL: అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయాలను సమర్థవంతంగా అందిస్తామని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 2 లక్షల 25 వేల విలువైన ఎల్‌వోసీని అందజేశారు.
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
BDK: భద్రాచలం లో POW డివిజన్ కమిటీ మహిళ నాయకులు సమావేశమయ్యారు. పాయం రాజమ్మ పాల్గొని మాట్లాడుతూ.. మల్లన్న జాతరలో చాకలి కుటుంబంపై , ఐదు నెలల పసికందు ను కాలితో గొంతు నలిమి చంపడం దారుణమని మండిపడ్డారు. రెడ్డి దొరలు ఇప్పటివరకు హంతకులను పట్టు కోక పోవడం పోలీసులు హంతకుల కే కొమ్ములు కాయడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య సిగ్గుచేటు అన్నారు.
MDK: కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సుమలతకు రూ.53,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కును జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ఈ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆమె తెలిపారు. వెంకటేశం, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని నజీరాబాద్ తండాలో పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య సందర్శించారు. తండాలో అండర్ డ్రైనేజ్, వీధి దీపాలు, సీసీ రోడ్లు, ఎక్కడ లేవో ఆ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలో ప్రతి ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా బుట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి వైస్ ఛైర్మన్ హనుమంతు పాల్గొన్నారు.
WNP: పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో మొబైల్ షాప్ దగ్ధం ఘలనలో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మంగళవారం స్థానిక మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ రావు తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, షాప్ నిర్వాహకుడు మహేశ్, వడ్డే ఈశ్వర్ తదితరులు పంచనామాకు హాజరై బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
NZ: నవీపేట్ మండలం బినోల, నందిగాం శివారుల్లో గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లో అమర్చిన నాలుగు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను దొంగిలించారు. రైతులు మంగళవారం ఉదయం గమనించి వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
NLG: నాగర్ కర్నూల్ జిల్లాలో చాకలి మహిళపై దాడి, రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన అమానుష ఘటనను నిరసిస్తూ మండలంలోని ఇర్కిగూడెంలో BC,SC,ST జేఏసీ ఆధ్వర్యంలో సంతాప సభ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. చిన్నారి మృతికి సంతాపం ప్రకటిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల నుంచి కంకర తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్ వర్మ పట్టుకున్నారు. మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్‌ను గుర్తించి సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు తరలించి సీజ్ చేశారు.
VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సోమ్లా NSS కంటింజెంట్ అధికారిగా, మరియు విద్యార్థి ప్రవీణ్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఈరోజు నుంచి మార్చి 2 వరకు కర్ణాటకలో జరగనున్న ఈ శిబిరానికి వీరు వెళ్లనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయం తరపున మొత్తం 10 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు.