• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన పోలీసులు

HNK: దామెర మండలంలోని ఒగ్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు దామెర పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎస్సై అశోక్, తదితరులు ఉన్నారు.

March 12, 2026 / 03:08 PM IST

వేరుశనగ క్వింటాలకు ధర రూ.8,546

MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఇశాళ వేరుశనగ అత్యధికంగా రూ.8546 పలికిందని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజ పాషా తెలిపారు. అతి తక్కువగా రూ.4000 పలికిందని సూచించారు. మొత్తానికి 1500 క్వింటాళ్ల వేరుశనగ మార్కెట్‌కు వచ్చిందన్నారు. మొక్కజొన్న 459 క్వింటాళ్లు వచ్చాయని వెల్లడించారు. కందులకు రూ.7,285 ధర పలికిందన్నారు.

March 12, 2026 / 03:06 PM IST

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఫోటో ప్రదర్శన

SRPT: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం సందర్శించారు. స్థానిక రవి మహల్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

March 12, 2026 / 03:01 PM IST

‘బీఫాం వెనక్కి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’

WNP: పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశానని, కానీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో పార్టీ వనపర్తి భీఫామ్ ఇచ్చి, తిరిగి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చెప్పారు. పిల్లలు గుర్తుకు రావడంతో మానుకున్నాని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి వర్గమనే 2 వర్గాలుండేవని ఆయన పేర్కొన్నారు.

March 12, 2026 / 02:45 PM IST

గోల్డ్ షోరూంను ప్రారంభించిన.. మంత్రి, MLA

HNK: నక్కలగుట్టలో జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథులుగా మంత్రి సురేఖ, MLAలు KR నాగరాజు, రాజేందర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 02:44 PM IST

జిల్లాలో 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

MHBD: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు జిల్లా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) వెల్లడించారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

March 12, 2026 / 02:44 PM IST

నంది మేడారంలో బోర్‌వెల్ ఏర్పాటు

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో బోర్వెల్ తవ్వించారు. స్థానిక గంగపుత్ర కాలనీలో వేసవికాలం సందర్భంగా తాగునీటి సమస్య ఉందని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి బోర్వెల్ మంజూరు చేయించారు. ఇవాళ బోర్వెల్ వేయడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో నాయకులు, కాలనీ వాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

March 12, 2026 / 02:41 PM IST

క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మై భారత్ ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ డా. నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్నింగ్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

March 12, 2026 / 02:41 PM IST

‘అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం’

SRCL: అభివృద్ధిలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని, జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు విధులపై శిక్షణ ఇచ్చారు.

March 12, 2026 / 02:41 PM IST

రైతులకు వెజిటేబుల్ మినీ కిట్లు అందజేత

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో రైతు సాధికారత ఎఫ్ఈవో ఆధ్వర్యంలో జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా గురువారం రైతులకు ఉచితంగా వెజిటేబుల్ మినీ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడవి కిషన్, ఉద్యాన విస్తరణ అధికారి శైలజ, ఎఫ్ఈవో డైరెక్టర్ ఎర్రం నర్సింగ్ రావు, సీఈవో దినేష్, పుదరి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 02:41 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన.. మాజీ MLA

BHPL: గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన నగావత్ జ్యోతి-కిషన్ నాయక్ కుమార్తె వివాహ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 02:40 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. దయాకర్

JN: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రాడపాక లింగయ్య తండ్రి రాడపాక కొమురయ్య గురువారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దయాకర్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

March 12, 2026 / 02:39 PM IST

99 రోజుల ప్రగతి ప్రణాళిక సదస్సులో పాల్గొన్న మంత్రి

WGL: గీసుగొండ మండలం మరియపురంలో గురువారం 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, మేయర్ సుధారాణి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్ధన్నపేట, నర్సంపేట ఛైర్పర్సన్లు సారంగపాణి, పెండ్యాల లక్ష్మీ, డీసీపీ అంకిత్ కుమార్, DFOఅనుజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 02:37 PM IST

గాంధీభవన్‌కు బయలుదేరిన నాయకులు

NLG: హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో జరిగే ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ ఛైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఛైర్మెన్ బోడ స్వామి ఆధ్వర్యంలో పలువురు బయలుదేరారు. చిట్యాల కనకదుర్గమ్మ గుడి ఆవరణ నుండి ఈ బృందం ఉత్సాహంగా తరలివెళ్లింది.

March 12, 2026 / 02:34 PM IST

మత్తు పదార్థాల వల్ల అనేక అనర్థాలు: సీఐ

BDK: 99 రోజుల ప్రణాళికలో భాగంగా రామవరం జాతీయ రహదారిపై పోలీస్ సిబ్బంది గురువారం మానవహారం నిర్వహించారు. మత్తు పదార్థాల బారిన పడి యువత తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని కొత్తగూడెం టూ టౌన్ ప్రతాప్ సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను గురించి వివరించారు. డ్రగ్స్ గంజాయి వంటి మహమ్మారి బారిన పడకుండా ఉండాలని సూచించారు.

March 12, 2026 / 02:34 PM IST