• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

VIDEO: 108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

WNP: టీచర్స్ కాలనీకి చెందిన జ్యోతికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. మదనాపురం అంబులెన్స్ అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈఎంటీ జ్యోతి, పైలెట్ నయీం సమయస్ఫూర్తితో ప్రసవం చేయగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

March 12, 2026 / 03:42 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. వార్డ్ కౌన్సిలర్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ బ్రహ్మంగారి తండాకు చెందిన బానోత్ సీతారాం గురువారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న 1వ వార్డు కౌన్సిలర్ జాటోత్ సుజాత- హరీష్ నాయక్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో స్థానికులు ఉన్నారు.

March 12, 2026 / 03:42 PM IST

యాదాద్రిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ గవర్నర్ శివ ప్రసాద్ శుక్ల దంపతులు గురువారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు అర్చకులు ఘనస్వాగతం తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం కొండపైన శివాలయాన్ని దర్శించుకున్నారు. వారికి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

March 12, 2026 / 03:40 PM IST

గంజాయి విక్రయం.. ఏడుగురు అరెస్ట్

HYD: సికింద్రాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, చిలకలగూడ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లతో పాటు నలుగురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 11 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

March 12, 2026 / 03:40 PM IST

‘చదువుతోపాటు నాయకత్వ లక్షణాలు అమర్చుకోవాలి’

MHBD: జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా ఇవాళ టాలెంట్ టెస్ట్‌లో గెలుపొందిన విద్యార్థులకు GCDO విజయ కూమారి బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి పట్ల మధు, గందసిరి జ్యోతి బాసు, SFI నేతలు ఉన్నారు.

March 12, 2026 / 03:36 PM IST

డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం సీఎం కృషి

BDK: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విశేష కృషి చేస్తుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గురువారం చంద్రుగొండ మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు.

March 12, 2026 / 03:36 PM IST

NSS వాలంటీర్లను అభినందించిన వీసీ

MBNR: పాలమూరు యూనివర్సిటీకి చెందిన NSS వాలంటీర్లు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇవాళ వీసీ ప్రో. జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి క్యాంపులు విద్యార్థుల్లో జాతీయ సమగ్రతను పెంపొందిస్తాయని తెలిపారు. NSS సమన్వయకర్త డా. కే. ప్రవీణ, కంటింజెంట్ లీడర్ సోమ్లా తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 03:34 PM IST

భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో బస్సులు

BDK: భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్లో శ్రీరామనవమి వేడుకలపై TSRTC సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. కరీంనగర్ డిపో మేనేజర్ సాల్మన్ ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని వారు సూచించారు. ఈ నెల 27, 28న స్వామివారి కళ్యాణానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు.

March 12, 2026 / 03:33 PM IST

రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే

BDK: చండ్రుగొండ మండల రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు అందజేస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

March 12, 2026 / 03:33 PM IST

రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్

SRPT: సూర్యాపేట డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో ఖాళీగా ఉన్న 15 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డీఓ వేణుమాధవరావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18-40 ఏళ్ల లోపు ఉన్న స్థానికులు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 14 వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆత్మకూర్.ఎస్, సూర్యాపేట తదితర మండలాల్లో ఖాళీలు ఉన్నట్లు RDO వెల్లడించారు.

March 12, 2026 / 03:33 PM IST

‘ఉపసర్పంచుల ‘చెక్ పవర్’ రద్దు చేయాలి’

RR: గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్న ఉపసర్పంచుల ‘చెక్ పవర్’ను రద్దు చేయాలని సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో వారు సంతకాలు చేయకపోవడంతో డ్రైనేజీలు, వీధి దీపాల పనులు నిలిచిపోతున్నాయని కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. చెక్ పవర్ బాధ్యతను కార్యదర్శి లేదా ఎంపీడీవోకు ఇవ్వాలని కోరారు.

March 12, 2026 / 03:31 PM IST

శిక్షణ తరగతులకు హాజరైన పాలకవర్గం సభ్యులు

MDK: జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు రామాయంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ ఛైర్ పర్సన్ పోచమ్మ నవనీత గణేష్‌తో పాటు కౌన్సిలర్‌లు హాజరయ్యారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికతో పాటు మున్సిపల్ పాలకవర్గం విధులు, వారి బాధ్యతలపై అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం నూతనంగా ఎంపికైన వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

March 12, 2026 / 03:30 PM IST

కవ్వంపల్లి పదవీ స్వీకారోత్సవానికి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

KNR: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ స్వీకారోత్సవానికి గురువారం కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. పరిధిలోని మండలాల నుంచి పార్టీ నాయకులు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

March 12, 2026 / 03:29 PM IST

‘అక్రమ కొండల త్రవ్వకలను నిలుపుదల చేయాలి’

KMM: కారేపల్లి మండలం గుట్ట కింద గుంపు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ కొండల తవ్వకాలను అడ్డుకోవడంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవీందర్ పూర్తిగా విఫలమయ్యారని BGBPS అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ధ్వజమెత్తారు. గురువారం కొత్తగూడెంలోని ప్రాంతీయ కార్యాలయంలో అధికారి రవీందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

March 12, 2026 / 03:28 PM IST

ఫోటో ఎగ్జిబిషన్‌ను వీక్షించిన.. MLA, కలెక్టర్

BHPL: “ప్రజాపాలన-ప్రగతి” కార్యక్రమంలో భాగంగా ఇవాళ BHPL పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు DPRO శ్రీనివాసరావు ఈ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే ఫోటోలను MLA గండ్ర, కలెక్టర్ వీక్షించారు.

March 12, 2026 / 03:27 PM IST