• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: నిర్మల రెడ్డి

SRD: ప్రతి ఇంటి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు. కందిలోని ఓ కన్వెన్షన్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు.

March 12, 2026 / 04:10 PM IST

ఉపాధి కూలీల హక్కుల కోసం పోరాటం చేస్తాం: కాంగ్రెస్

SDPT: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని సిద్దిపేట నియోజకవర్గ ఇంఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. గురువారం అర్బన్ మండలం తడకపల్లిలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉపాధి కూలీల పని దినాలు తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.

March 12, 2026 / 04:09 PM IST

ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతి

SRPT: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని మున్సిపల్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి గురువారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు, చిరు వ్యాపారస్తులు, రవాణా వ్యవస్థకు అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు వెంటనే నిర్మాణాన్ని రద్దు చేయాలన్నారు.

March 12, 2026 / 04:09 PM IST

కవిత ఇంటికి సీబీఐ అధికారులు

NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి గురువారం సీబీఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు నోటీసులు ఇవ్వడానికి ఆమె ఇంటికి అధికారులు చేరుకున్నారు. దీంతో ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్​ స్కామ్ కేసును ఇటీవల ఢిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

March 12, 2026 / 04:08 PM IST

ప్రజాప్రతినిధులకు శిక్షణలో పాల్గొన్న సర్పంచ్‌లు

MNCL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలలోని ప్రజాప్రతినిధులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జైపూర్ మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు పాల్గొన్నారు. వేలాల సర్పంచ్ డేగ స్వప్నతో పాటు కుందారం, పౌనూరు, శెట్‌పల్లి, నర్వ, కాన్కూర్, తదితర గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు శిక్షణకు హాజరయ్యారు.

March 12, 2026 / 04:06 PM IST

‘అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు పాత్ర పోషించాలి’

KMM: ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డుల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు పాత్ర పోషించాలని అన్నారు.

March 12, 2026 / 04:05 PM IST

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

SRD: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

March 12, 2026 / 04:02 PM IST

ఘనంగా ఆంజనేయస్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. గ్రామంలో ఏ వీధి చూసిన బంధువులతో కిక్కిరిసిపోయాయి. గుడి ప్రాంతమంతా భక్తి పరవశంతో మునిగిపోయింది.

March 12, 2026 / 04:02 PM IST

స్వల్పంగా పెరిగిన పత్తి ధర

KNR: జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. గురువారం రూ. 10 పెరిగి రూ. 7,500 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు రైతులు 13 వాహనాల్లో 98 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పు కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

March 12, 2026 / 04:01 PM IST

బహుజన సభను విజయవంతం చేయండి.!

GDWL: ఈనెల 15వ తేదీన బడంగ్ పేటలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహుజన రాజకీయ యుద్ధభేరి సభకు సంబందించిన కరపత్రాలను గురువారం ధరూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర విడుదల చేశారు. ఈ సందర్బంగా గద్వాల అసెంబ్లీ కార్యదర్శి సోంపురం దేవన్న మాట్లాడుతూ.. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకొని సభ జరుగుతుందని ఆయన అన్నారు.

March 12, 2026 / 04:01 PM IST

‘అంగడిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

SRCL: గొర్రెల అంగడిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బద్దెనపల్లి సర్పంచ్ సిలివేరి లావణ్య అన్నారు. తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో గొర్రెలు మేకల అంగడిని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గురువారం అంగడిని ప్రారంభించినప్పటికీ ప్రతి శుక్రవారం అంగడి జరుగుతుందని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 12, 2026 / 04:00 PM IST

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

JGL: పెగడపల్లి మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ పరీక్షకు మోడల్ స్కూల్, కేజీబీవీ, తాటిపెల్లి గురుకుల పాఠశాలలకు చెందిన 236 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం 10 గదులు, 10 మంది ఇన్విజిలేటర్లు, హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.

March 12, 2026 / 03:54 PM IST

బైక్‌పై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: చిన్నచింతకుంట మండలం చిన్న వడ్డేమాన్ గ్రామ సమీపంలో గురువారం బోయ అంజి అనే వ్యక్తి బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.

March 12, 2026 / 03:47 PM IST

సర్పంచుల ఫోరం అధ్యక్షుడికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు

NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, చిట్యాల మండల (పెద్దకాపర్తి సర్పంచ్) సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం జన్మదినం సందర్భంగా.. ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్‌లోని తన నివాసం వద్ద కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆవుల సుందర్, కట్ట ఆశయ్య, చిట్యాల కనకదుర్గ అమ్మవారి గుడి ఛైర్మన్ మారగోని ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 03:45 PM IST

డిగ్రీ కళాశాల సమస్యలపై ఏవోకి వినతి

KMR: డిగ్రీ కళాశాల సమస్యలపై కలెక్టరేట్‌లో ఏవోకికి గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. పది రోజుల క్రితం డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కళాశాలను ముట్టడించిన అనంతరం ప్రిన్సిపల్ విజయ్, ప్రిన్సిపల్ కిష్టయ్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ముఖం చాటేసారని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి డిగ్రీ కళాశాల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

March 12, 2026 / 03:44 PM IST