• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

క్రికెట్ పోటీలను ప్రారంభించిన పెబ్బేర్ మునిసిపాలిటీ ఛైర్మన్

WNP: పెబ్బేరు మండలం పేంచికలపాడు గ్రామంలో నిర్వహించిన PPL-9 క్రికెట్ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మునిసిపాలిటీ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ క్రీడలు ప్రారంభించారు. మానసిక ఒత్తిడిని దూరం, శారీరకంగా దృఢంగా ఉండటానికి దోహదం చేస్తాయని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి సహాయపడతాయని తెలిపారు.

March 16, 2026 / 03:00 PM IST

‘కాంగ్రెస్ సర్కార్ లో కరెంట్ కోతలు’

NLG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలు విధిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా విమర్శించారు. ఎండలు పెరుగుతున్న సమయంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిపై ప్రభుత్వం స్పందించాలని ట్వీట్ ద్వారా తెలిపారు.

March 16, 2026 / 03:00 PM IST

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

BHNG: ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చౌటుప్పల్ పురపాలక ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, ఆసుపత్రిలోని గైనిక్ వార్డు, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ప్రతీ రోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.

March 16, 2026 / 03:00 PM IST

బిల్లులు వెంటనే చెల్లించాలని ధర్నా

SDPT: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బెజ్జంకి మండలానికి చెందిన ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ నినాదాలు చేశారు.

March 16, 2026 / 03:00 PM IST

రేపు ఎల్లారెడ్డిలో ఉపాధి హామీ ప్రజావేదిక

KMR: ఎల్లారెడ్డి MPDO కార్యాలయంలో రేపు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO ప్రకాష్ తెలిపారు. మండలంలోని 31 గ్రామాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై ఈనెల 4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాయని అన్నారు. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికలపై రేపు ఉ.10 గంటలకు MPDO కార్యక్రమం ఉందన్నారు.

March 16, 2026 / 03:00 PM IST

గ్యాస్ ధరల పెంపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే: పశ్య పద్మ

SRPT: గ్యాస్ ధరల పెంపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ విమర్శించారు. సోమవారం హుజూర్‌నగర్‌లో గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం సామాన్యులపై భారాలు మోపుతోందని, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

March 16, 2026 / 03:00 PM IST

గాలికుంటు నివారణ టీకాలు ప్రారంభం..!

GDWL: పశువులకు వ్యాధులు సోకిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే టీకాలు వేయించి వాటిని కాపాడుకోవాలి అని పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష అన్నారు. సోమవారం మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. పశువైద్యాధికారిణి డాక్టర్ ఉష మాట్లాడుతూ.. నోటి నుండి చొంగ కారడం, గిట్టల మధ్య పుండ్లు రావడం ఈ వ్యాధి లక్షణాలన్నారు.

March 16, 2026 / 03:00 PM IST

ఆర్‌టీఐ సమాచారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు..!

MLG: ములుగు మున్సిపాలిటీ కమిషనర్ ఇచ్చిన ఆర్‌టీఐ సమాచారంపై జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తోటకూరి శ్రీకాంత్ గౌడ్ గ్రీవెన్స్ కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించారు. ఆర్‌టీఐ కింద కోరిన సమాచారానికి తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

March 16, 2026 / 02:55 PM IST

కార్పొరేటర్ సేవలను కొనియాడిన మహిళలు

SRD: GHMC రామచంద్రాపురం 112వ డివిజన్ పరిధిలోని కాలనీల మహిళలు మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్‌ను ఇవాళ ఘనంగా సత్కరించి ప్రశంసించారు. రెండు సార్లు GHMC కార్పొరేటర్‌గా, అలాగే వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆమె ప్రజలకు అనేక సేవలు అందించారన్నారు. ఈ సందర్భంగా పుష్ప నగేష్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

March 16, 2026 / 02:48 PM IST

‘అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’

BDK: అశ్వాపురం మండలం చింతిర్యాల గోదావరిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని సోమవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఉన్నత అధికారుల దృష్టికి అక్రమ ఇసుక రవాణా గురించి తీసుకువెళ్లినా పట్టించుకునే నాధుడే లేరని అన్నారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించాలని అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 16, 2026 / 02:46 PM IST

ఎన్నికల హామీలు అమలు చేయాలని ఎంఆర్వోకు వినతి

NLG: వేములపల్లి మండల BJP అధ్యక్షుడు పెదమాం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని MRO హేమలతకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలకు నిధులు కేటాయించి తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను, గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్ల తీసుకుంటుందని భరత్ అన్నారు.

March 16, 2026 / 02:45 PM IST

కారు ఢీకొని భార్యభర్తలకు గాయాలు

NZB: ఎడపల్లి మండలం పోచారం గ్రామ సమీపంలోని బషీర్ ఫారం వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. జమలం గ్రామానికి చెందిన గంగామణి, లక్ష్మణ్ వ్యవసాయ కూలీ పనికి నిజామాబాద్ వెళ్తుండగా గుర్తుతెలియని కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. 108 సిబ్బంది గంగామణి, అనిల్ ప్రథమ చికిత్స అందించి బాధితులను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

March 16, 2026 / 02:45 PM IST

సంతల వేలం పాటను దక్కించుకున్న గంగన్న

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో నిర్వహించే దిన, వారసంతల వేలం పాటను బీరవేణి గంగన్న దక్కించుకున్నారు. సోమవారం పోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన వేలం పాటలో బీరవేణి గంగన్న దినసంతకు రూ. 4.90 లక్షలు, వారసంతకు రూ .9.24 లక్షలు, మొత్తం రూ. 14.24 పాటను పాడి సంతల నిర్వహణ హక్కులను దక్కించుకున్నారు.

March 16, 2026 / 02:44 PM IST

MLG పట్టణ అధ్యక్షుడిగా.. రాకేష్

MLG: BJP ములుగు పట్టణ అధ్యక్షుడిగా ఇమ్మడి రాకేష్‌ను నియమించినట్లు సోమవారం BJP జిల్లా అధ్యక్షుడు బలరాం తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ.. పట్టణంలో BJP పార్టీని అభివృద్ధి చేసేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, పట్టణ నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

March 16, 2026 / 02:43 PM IST

జనగణనపై అధికారులకు దిశానిర్దేశం

GDWL: ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా గణన దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఛార్జ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. 2026 సెన్సెస్‌లో భాగంగా మొదటి విడతలో ఇళ్ల గణనను పూర్తిగా స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నట్లు తెలిపారు.

March 16, 2026 / 02:40 PM IST