MLG: BJP ములుగు పట్టణ అధ్యక్షుడిగా ఇమ్మడి రాకేష్‌ను నియమించినట్లు సోమవారం BJP జిల్లా అధ్యక్షుడు బలరాం తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ.. పట్టణంలో BJP పార్టీని అభివృద్ధి చేసేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, పట్టణ నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.