GDWL: ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా గణన దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఛార్జ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. 2026 సెన్సెస్‌లో భాగంగా మొదటి విడతలో ఇళ్ల గణనను పూర్తిగా స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నట్లు తెలిపారు.