SRPT: గ్యాస్ ధరల పెంపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ విమర్శించారు. సోమవారం హుజూర్నగర్లో గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం సామాన్యులపై భారాలు మోపుతోందని, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.