KMM: ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్ళ మోహన్ రావు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం రూరల్ మండల పీహెచ్సీ వద్ద నిరసన చేపట్టి వైద్యాధికారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు.
HNK: వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. నగరంలోని అలంకార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తికి గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న MLA నాయిని విషయాన్ని గమనించి వాహనాన్ని ఆపారు. వెంటనే క్షతగాత్రుడి వద్దకు వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ఆటోను ఆపి చికిత్స నిమిత్తం దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు.
WGL: GWMC 19వ డివిజన్ పరిధిలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం వీధిలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్లు ప్రారంబోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు నల్ల సతీష్- ఉమ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
JGL: రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సోమవారం ఆసుపత్రికి వెళ్లి మంత్రిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైంది. సుబేదారి సీఐ రంజిత్ కుమార్ వివరాల ప్రకారం.. ఈ నెల 13న షైన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చివరి పరీక్ష రాసింది. అనంతరం స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళ్తానని చెప్పి రోడ్డు దాటింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో తండ్రి విజయ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ASF: పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
NRPT: జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో వరి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ, కోత దశకు చేరుకున్న సమయంలో బోర్లలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. భూమి నెర్రలు వచ్చి చీలిపోయే పరిస్థితి రావడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. దిక్కుతోచని స్థితిలో తమ పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు.
ADB: ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సాత్నాల మండలంలోని సైదుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నిర్వహించిన మెడికల్ క్యాంపులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజలు నాటు వైద్యులను నమ్మి మోసపోకూడదని హితవు పలికారు.
KNR: జమ్మికుంటలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు గుడివాడ వెంకట సతీష్ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు మజ్జిగ, చల్లటి నీళ్లు పంపిణీ చేశారు.
NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు దేశమోని పరశురాముడు ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
సిరిసిల్లలోని గాంధీ విగ్రహానికి కళ్ళజోడు పెట్టించాలని స్థానికుడు కొత్వాల్ సాయిరాం కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్లలోని గాంధీ విగ్రహానికి కళ్ళజోడు లేకుండా ఉందని అధికారులు కళ్ళజోడు పెట్టించాలన్నారు.
SRD: కేజీబీవీ, యూఆర్ఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో కిక్ బాక్సింగ్ పోటీలు సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
WNP: పెబ్బేరు మండలం పేంచికలపాడు గ్రామంలో నిర్వహించిన PPL-9 క్రికెట్ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మునిసిపాలిటీ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ క్రీడలు ప్రారంభించారు. మానసిక ఒత్తిడిని దూరం, శారీరకంగా దృఢంగా ఉండటానికి దోహదం చేస్తాయని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి సహాయపడతాయని తెలిపారు.
NLG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలు విధిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా విమర్శించారు. ఎండలు పెరుగుతున్న సమయంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిపై ప్రభుత్వం స్పందించాలని ట్వీట్ ద్వారా తెలిపారు.