• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పెద్దజట్రంలో ఘనంగా ఇఫ్తార్ విందు

NRPT: ఉట్కూరు మండలం పెద్దజట్రం గ్రామంలో ముస్లిం సోదరులకు సర్పంచ్ వాకిటి వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసంలో కఠిన ఉపవాస దీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రామంలో హిందూ-ముస్లింలు సోదరభావంతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి పవన్ కుమార్, ఎక్స్ ఎంపీటీసీ కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

March 16, 2026 / 06:54 AM IST

రంజాన్ ఇఫ్తార్ విందు ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్ పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 24వ వార్డు కౌన్సిలర్ నిజాం ఆధ్వర్యంలో స్థానిక మదర్సాలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సహనం, సేవాభావం ఈ మాసం గొప్పతనమని అన్నారు.

March 16, 2026 / 06:50 AM IST

పెరుగుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!

MDCL: జిల్లా వ్యాప్తంగా ఎండలు ముదురుతున్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ ప్రాంతంలో గరిష్టంగా 38°C నమోదు కాగా, ఈఎస్సెస్ డీపీ.పల్లి, బాచుపల్లి ప్రాంతాల్లో 37.7°C నమోదైంది. మల్కారం, బాలానగర్, శామీర్‌పేట్, ఉప్పల్, కీసర ప్రాంతాల్లో కూడా 36°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

March 16, 2026 / 06:47 AM IST

శ్మశానవాటికలో నీటి సమస్య.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా సమీప శ్మశాన వాటికలో చేతి పంపు చెడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంత్యక్రియల అనంతరం ముఖాలు శుభ్రం చేసుకుందామన్నా నీరు రాకపోవడంతో అవస్థలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ఈద్గా కమిటీ సభ్యులు వెంటనే స్పందించి బోరింగ్‌కు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.

March 16, 2026 / 06:47 AM IST

హోటళ్లపై దాడులు.. 21 సిలిండర్లు స్వాధీనం

ఖమ్మం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల గ్యాస్‌ను వ్యాపారాలకు వాడుతున్న హోటళ్లపై పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న 21 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురు హోటల్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా సిలిండర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

March 16, 2026 / 06:44 AM IST

14 నెలల చిన్నారిని చంపిన తల్లి

HYD: గోల్కొండలోని రిసాలా బజార్‌లో దారుణం జరిగింది. 14 నెలల చిన్నారి ఉమ్మె అహ్మద్‌ను తన తల్లి గౌసియాబేగం దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ ఘాతుకానికి భర్తతో గొడవ, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు, స్థానికులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆస్పత్రికి తరలించిన చిన్నారి మృతి చెందగా, నిందుతురాలు పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 16, 2026 / 06:43 AM IST

జన గణనలో నిర్లక్ష్యం వద్దు: జడ్పీ సీఈవో

వికారాబాద్: జిల్లాలో జన గణనను ఖచ్చితత్వంతో, పక్కా ప్రణాళికతో నిర్వహించాలని జడ్పీ సీఈవో సుధీర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.

March 16, 2026 / 06:39 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. రవి పటేల్

BHPL: జిల్లా కొరికిశాల గ్రామంలో నిన్న భావి పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్నTRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆదివారం సాయంత్రం మృతుడు అభిషేక్ నివాసానికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో TRP జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

March 16, 2026 / 06:38 AM IST

మెదక్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం

మెదక్‌లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గత పది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అకాల వర్షమైనప్పటికీ ఎండ తీవ్రతకు ఎండిపోతున్న యాసంగి వరి పంటలకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

March 16, 2026 / 06:36 AM IST

‘శాంతి శ్రేయస్సులో భాగస్వాములు కావాలి’

BDK: రంజాన్ మాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాషా, మేయర్ గణేష్ అన్నారు. ఆదివారం రామవరం 14వ నెంబర్ మదీన మసీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతన, కఠిన ఉపవాస దీక్షలు జీవనశైలికి రంజాన్ మాసం వేదికని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు శాంతి శ్రేయస్సులో భాగస్వాములు కావాలని కోరారు.

March 16, 2026 / 06:36 AM IST

‘ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి’

ASF: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీకి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ కోసం పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి అమలు చేయాలని కోరారు.

March 16, 2026 / 06:36 AM IST

కృష్ణ బ్రిడ్జి సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యం

NRPT: కృష్ణ మండలంలోని బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు మాగనూరుకు చెందిన నల్లె నాగప్ప(45)గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఆయన స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. మృతుడి తమ్ముడు కురుమయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై నవీద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 16, 2026 / 06:35 AM IST

పాలీసెట్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం పాలీసెట్ (POLYCET) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ జానకి సూచించారు. ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం విద్యార్థులు www.tspolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చన్నారు.

March 16, 2026 / 06:33 AM IST

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: గణేష్ రెడ్డి

ADB: అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందాలని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రుయ్యాడి గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఇండ్లు నిర్మించలేదని పేర్కొన్నారు.

March 16, 2026 / 06:29 AM IST

మంగనూరులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

NGKL: మంగనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణా రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

March 16, 2026 / 06:28 AM IST