MDCL: జిల్లా వ్యాప్తంగా ఎండలు ముదురుతున్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ ప్రాంతంలో గరిష్టంగా 38°C నమోదు కాగా, ఈఎస్సెస్ డీపీ.పల్లి, బాచుపల్లి ప్రాంతాల్లో 37.7°C నమోదైంది. మల్కారం, బాలానగర్, శామీర్పేట్, ఉప్పల్, కీసర ప్రాంతాల్లో కూడా 36°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.