BHNG: మోత్కూరు మండలం పాటిమట్లకు చెందిన దొండ కొమురయ్య (58) తన పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తుండగా స్విచ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాకు గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.