• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా పి.ఏ పల్లి మండలం రంగారెడ్డిగూడెం స్టేజీ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ​మృతుడిని గుర్రంపోడు మండలం కాసారం గ్రామానికి చెందిన బొమ్మనమోని అఖిల్ (23)గా గుర్తించారు.

March 20, 2026 / 08:32 AM IST

అక్రమ రవాణా పై రాజీలేని పోరాటం చేస్తాం: డీఎస్పీ

BDK: 2025 జనవరి నుంచి జిల్లావ్యాప్తంగా 86 కేసులు నమోదు చేసి, రూ. 34 కోట్ల విలువైన 6,844 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. గురువారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపుతామన్నారు.

March 20, 2026 / 08:32 AM IST

పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంత్రి వివేక్

MNCL: నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. రామకృష్ణాపూర్ గణేష్ ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు.

March 20, 2026 / 08:30 AM IST

మండలంలో ఘనంగా ఇఫ్తార్ విందు

VKB: బంట్వారం మండల కేంద్రంలోని మసీదులో నిన్న ముస్లిం సోదరుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరించే వారికి ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొని మత సామరస్యానికి, సోదరభావానికి ప్రోత్సాహమివ్వాలని తెలిపారు. స్థానికులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

March 20, 2026 / 08:29 AM IST

డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

BDK: మధిర ఇల్లందులపాడులో మున్సిపల్ ఛైర్పర్సన్ సామినేని సుజాత ఆధ్వర్యంలో భట్టి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో రూ. 594 కోట్లతో రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. మధిర, బోనకల్, ఎర్రుపాలెం, వైరా మండలాల్లో 5 ప్రధాన రహదారులు ఫోర్ లైట్ ఏర్పడుతుందని అన్నారు.

March 20, 2026 / 08:28 AM IST

సీఎం ప్రోగ్రాంకు ప్రత్యేక బస్సు

SRCL: నర్మెట్టలో అత్యాధునిక ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ఈ నెల 22న సీఎం ప్రారంభించనున్నారు. 20 నుంచి 22 వరకు జరిగే రైతు మేళాలో సాగు పద్ధతులు, దిగుబడిపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. సిరిసిల్ల రైతుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం ఉందని, పాల్గొనేవారు 73966 67094 నంబర్‌కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.

March 20, 2026 / 08:25 AM IST

భద్రాద్రి మార్ట్ నామకరణం చేస్తూ సరికొత్త హంగులు

BDK: ప్రస్తుతం ఉన్న గిరి బజార్ను ఆధునీకరించి, భద్రగిరి మార్ట్‌గా నామకరణం చేస్తూ సరికొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నామని పిఓ రాహుల్ గురువారం తెలిపారు. జిల్లాలోని ఆదివాసీల స్వహస్తాలతో తయారైన, ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ITDA సిద్ధమని అన్నారు. ఈ నెల 27న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ మార్ట్‌ను ప్రారంభించనున్నారు.

March 20, 2026 / 08:25 AM IST

‘ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయి’

PDPL: ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మారంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, మండలాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

March 20, 2026 / 08:22 AM IST

భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం

BDK: భద్రాద్రి క్షేత్రంలో ఈ నెల 27న మిథిలా స్టేడియం వేదికగా జరగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు.

March 20, 2026 / 08:20 AM IST

పిల్లలకు రోబోటిక్స్ పై అవగాహన

MDCL: ఉప్పల్, అత్తాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో విద్యార్థులకు రోబోటిక్స్ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి పెంచేందుకు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. రోబోలు ఎలా పనిచేస్తాయో, కోడింగ్ ప్రాథమికాలు నేర్పుతూ భవిష్యత్‌కు సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై పిల్లలు ఆసక్తి చూపించడం గమనార్హం.

March 20, 2026 / 08:15 AM IST

యువ క్రీడాకారుడికి అండగా మాజీ ఎమ్మెల్యే

MDK: అంతర్జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు మాలవత్ అంకిత నాయక్‌కు ఆర్థిక భరోసా లభించింది. జడ్ చెరువు తండాకు చెందిన ఈ యువ క్రీడాకారుడికి శిక్షణ కోసం సర్పంచ్ రామచందర్ నాయక్ సహకారంతో మాజీ MLA హనుమంత్ రావు రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ఆనందదాయకమన్నారు.

March 20, 2026 / 08:12 AM IST

‘శాంతి భద్రతలు కాపాడడం అందరి బాధ్యత’

RR: యాచారం మండలం మేడిపల్లి గ్రీన్ ఫార్మా సిటీ PSలో CI సత్యనారాయణ పీఎస్ కమిటీ సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఏవైనా వివాదాలు తలెత్తిన సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రంజాన్, శ్రీరామనవమి పండుగల ఉత్సవాల సందర్భంగా అందరూ పరస్పర సహకారంతో, సామరస్యంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు.

March 20, 2026 / 08:12 AM IST

కొలనులో జారిపడి యువకుడి మృతి

KMR: పండగ పూట విషాదం నెలకొంది. కాళ్లు శుభ్రం చేసుకునేందుకు కొలనులోకి దిగిన ఓ యువకుడు జారిపడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన షాద్​నగర్​లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని నేరల్​తండాకు చెందిన బార్దవల్​ రాజు(21) షాద్​నగర్​లోని ఓ ప్రైవేట్​ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు.

March 20, 2026 / 08:10 AM IST

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు

MBR: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, యువకులు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

March 20, 2026 / 08:08 AM IST

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

HYD: బంజారాహిల్స్‌ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నిన్న ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని శ్రీ రాధా గోవిందకు ప్రత్యేక అలంకారం చేశారు. శ్రీదేవి భూదేవి సమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం, పల్లకి ఉత్సవం భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. HKM హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస్ ప్రభుజీ పాల్గొన్నారు.

March 20, 2026 / 08:08 AM IST